కెసిఆర్‌ ముందుచూపుతో సోలార్‌ పవర్‌

share on facebook

24గంటల విద్యుత్‌కు కలసి వస్తున్న ఉత్పత్తి

మెదక్‌,జూలై25(జ‌నంసాక్షి): సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడానికి సీఎం తీసుకున్న చొరవ కారణంగానే 24గంటల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా నడుస్తోంది. మెదక్‌ జిల్లాలో సోలార్‌ పవర్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు మెదక్‌ జిల్లా అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది. సంప్రదాయేతర ఇంధన

వనరుల ఉత్పత్తిలో ప్లాంట్లను నెలకొల్పడంలో జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు, విద్యుత్‌, గనులు, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ, మంత్రిత్వ శాఖ మెదక్‌ జిల్లాకు అవార్డును అందించింది. తెలంగాణలోనే విద్యుత్‌ కొరతను ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందుకనుగుణంగానే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసింది. ఇదే విషయాన్ని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ప్రజల్లో అవగాహన కలిగించి క్షేత్రస్థాయిలో వ్యక్తిగత ప్లాంట్ల ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు దేశ స్థాయిలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రంగంలో ఇకపైన కూడా పెద్ద ఎత్తున కృషి ఉంటుందని అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు విద్యుత్‌ కొరత ఉండేది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటలో 5 మెగా వాట్ల ఎ/-లాంట్‌, కౌడిపల్లి మండలం బుజరంపేట్‌లో 3 మెగావాట్లు, వెంకటాపూర్‌లో 6.7 మెగా వాట్లు, రేగోడ్‌ టి.లింగంపల్లి 10 మెగా వాట్ల విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పారు. టేక్మాల్‌ మండలం పల్వంచ గ్రామాల్లో 5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌, రామాయంపేట మండలం కోనాపూర్‌లో విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పారు. నర్సాపూర్‌ మండలం అవాంచ, మెదక్‌ మండలం మంబోజిపల్లి, అల్లాదుర్గం మండల కేంద్రం శివారులో 10 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను నెలకొల్పారు. గతంలో అన్నిరంగాల్లో విద్యుత్‌ కోతలు ఉండేవని, ఆ పరిస్థితి నుంచి అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు అవసరాలకు తగిన విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు 24 గంటల విద్యుత్‌ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా సోలార్‌ వాటర్‌ హీటర్స్‌, సోలార్‌ లాంతర్లు, సోలార్‌ కుక్కర్స్‌, సబ్సిడీ విూద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

Other News

Comments are closed.