కెసిఆర్‌ రాకతో గజ్వెల్‌ రూపురేఖలు మారాయి

share on facebook

ఇంతటి అభివృద్ది గతంలో ఎప్పుడూ లేదు: హరీష్‌ రావు

గజ్వేల్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేసీఆర్‌ను గెలిపించుకున్నాక అభివృద్ధిలో గజ్వేల్‌ రూపురేఖలు మారిపోయాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఎన్నడయినా ఇలాంటి అభివృద్దిని చూశారా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నిర్వహించిన నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో

ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నీటికొరత స్పష్టంగా కన్పించేదని, ఇప్పుడా సమస్యే లేదన్నారు. ఇంటింటికి మిషన్‌ భగీరథతో నీరు అందసి/-తున్న ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. గజ్వేల్‌లో 65 ఏళ్లు పలు పార్టీలనుంచి ఎందరో ఎమ్మెల్యేలు వచ్చి పోయారని, ఇంతమంది వచ్చినా తాగునీరు ఇవ్వలేక పోయారని విమర్శించారు. నీటి ట్యాంకర్లు వచ్చినప్పుడు బిందెలు కొట్లాడాయి.. ఆడపడుచులు కొట్లాడుకునేవారన్నారు. కానీ, రోజు గజ్వేల్‌లో ఆ పరిస్థితిలేదన్నారు. ఇక్కడి ప్రజలతో స్వచ్ఛమైన నీరు తాగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 65 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే చేయని పనిని 4 ఏళ్లలో కేసీఆర్‌ చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకున్నారన్నారు. అందువల్ల్‌ మరోమారు కెసిఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

 

 

Other News

Comments are closed.