కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు

share on facebook

బిజెపి నేత సుగుణాకర్ రావు.
కరీంనగర్: 30 జూలై (జనం సాక్షి)
కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పి సుగుణాకర్ రావు అన్నారు .  రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు .కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కుల మత వర్గాలకు అతీతంగా , రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని చెప్పి ఇప్పుడు కేవలం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న తొక్కుతూ నందున వెంటనే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కోరారు. చింత మడుగు ప్రజలకు ఇంతకీ   ,10 లక్షల రూపాయలను ఇవ్వడానికి సిద్దపడ్డ సీఎంకు ప్రేమ అనుబంధాలు  కనబడుతున్నాయి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. అది మర్చిపోయినా సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కి పరిపాలన పరిమితం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి వస్తుంది అన్నారు. సభ్యత్వ నమోదు కోసం ఆగస్టు 1 నుండి ఇంటికి వెళ్దాం అన్నారు. రాష్ట్రంలో కరువు కొట్టుమిట్టాడుతున్నారు. రైతులకు వాన కల పంటలు వేసుకునే సమయం లేకుండా పోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి రైతులకు ఇవ్వాల్సిన సూచనలు సరైన సమయంలో ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు భాషసత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నబోయిన ఓదెలు, మోర్చా రాష్ట్ర నాయకులు మారుతి, హరి కుమార్ గౌడ్  తదితరులుపాల్గొన్నారు.

Other News

Comments are closed.