కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఏదీ

share on facebook

మంత్రి పదవులు లేకుండానే  ఎన్నికలకు సిద్దం
ప్రజలు బిజెపి నేతలను ఆదరిస్తారన్న నమ్మకం ఉందా?
హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రానిధ్యం లేకుండా ఎన్నికలకు వెళుతున్న వేళ బిజెపిని ప్రజలు నమ్ముతారా అన్నది చూడాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దత్తాత్రేయను మంత్రి విస్తరణలో తొలగించి తెలంగాణకు స్థానం లేకుండా చేయడంతో పాటు ఇప్పుడు ఆయనకు పార్టీ టిక్కెట్‌ కూడా నిరాకరించింది. దీంతో ఇప్పుడు పార్టీ పరంగా ముందుకు వెళ్లడంలో ఇక ఇబ్బందులు తప్పవని పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర సర్కార్‌లో తెలుగు ప్రజలకు వాయిస్‌ లేకుండా పోయిందన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకాలం తెలుగువాడిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో కొంత వెలితి ఏర్పడిందని, తరవాత దత్తాత్రేయను కూడా తప్పించడంతో మరింతగా తెలంగాణను పక్కకు నెట్టేసినట్లుగా అయ్యిందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ, విభజన సమస్యలు వెన్నాడుతున్న తరుణంలో ప్రానిధ్యం లేకుండా పోయిందని ఉభయ తెలుగురాష్ట్రాల  బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల విమర్శలకు ఇదో అవకాశంగా మారిందని మదన పడుతున్నారు.  ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయను పక్కకు పెట్టారు. వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి చేశారు. దీంతో ఇక తెలుగు రాష్ట్రాలకు ఏడాది కాలంగా పెద్దదిక్కు అన్నది లేకుండా పోయింది.కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని కొంతకాలంగా ఎదురుచూసిన బీజేపీ నేతలకు ఇక ఎన్నికలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పుతామని బీరాలు పలుకుతున్న బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఓ రకంగా అవమానకరంగానే ఉంది.కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించే నేతలు కరువయ్యారు. కేంద్ర మంత్రి పదవిని ఆశించిన  ఎందరో నేతలు మోడీ ఎత్తులతో భంగపడ్డారు. ఈ దశలో ఉభయతెలుగు రాష్ట్రాల్లో భంగపాటు తప్పదని తెలంగాణ ఎన్నికల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. మోడీ భజనతో లాభం లేదని మొన్నటి ఫలితాలు రుజువు చేశాయి. ఇప్పుడు అదే పునరావృతం అవుతుంది. ఎపి, తెలంగాణల్లో బిజెపికి ఒక్కసీటు రాకున్నా ఆశ్చర్యపడాల్సిన అసరం లేదు.

Other News

Comments are closed.