కేంద్రీయ వర్సిటీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

share on facebook

– అనంతపురంలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
న్యూఢిల్లీ, మే16(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనంతపురం జిల్లా జంతలూరులో ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం మధ్యాహ్నం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హావిూ ఇచ్చింది. దీనికనుగుణంగానే తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల పక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విూడియాకు వెల్లడించారు.

Other News

Comments are closed.