కేధార్‌ నాథ్‌ ఘటన

share on facebook

ఇది శివ తాండవమా.!
లేక ప్రకృతి విధ్వంసమా..!
త్రినేత్రుడు మూడో కన్ను తెరిచాడా
రుద్రుడు ఉగ్ర రూపం దాల్చాడా
లేక గంగమ్మ తల్లి ఆవేశంతో కోపగించుకుందా
లయకారుడు లయ తప్పినాడా
లేక జల ప్రలయం రూపంలో మృత్యువు రాజ్యమేలుతుందా
అని అనిపిస్తుంది అక్కడి పరిస్థితులను చూస్తుంటే
ఛార్‌థామ్‌లో ఎటు చూసినా భీబత్సపు వాతావరణం భయానకపు దృశ్యాలు
నా అనే వారికోసం తపిస్తున్న బంధు మిత్రుల వేదనలు
కఠిన హృదయాలను సైతం ద్రవింపజేసే ఆత్మీయుల రోదనలు
చిన్నారుల ఆకలికేకలు పెద్దల హాహాకారాలు
సందేట్లో సడేమియాలాగా నేపాలీల దోపిడీలు
శవాలపైనున్న ఆభరణాలు చీరెలు
జ్యోతిర్లింగాలలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం
ప్రస్తుతం అది వందలాది శవాలనిలయం
ఊహించనిరీతిలో జరిగిన ఘోరవైపరిత్యం
కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందంటే
అదో విధి ఆడిన విషాధ కరాళ నృత్యం
దేవదర్శనానికి వెళితే అనుగ్రహిస్తాడనుకున్న భగవంతుడు ఆగ్రహించాడు
భక్తులపాలిట మృత్యుశాపమై వారిని తనలోకి ఇముడ్చుకున్నాడు
ఇదిభక్తులకు కలిగిన మోక్షమా..?
లేక దేవుడు విధించిన శిక్షా..?
– కె.సురేశ్‌ బాబు
సుల్తానాబాద్‌
కరీంనగర్‌
సెల్‌:8019432895

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *