కేసీఆర్‌ను గద్దెదింపేందుకే..  మహాకూటమితో బరిలోకి

share on facebook


– చంద్రబాబు వ్యాఖ్యలు హర్షణీయం
– బీసీలకు 34సీట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరతా
– కాంగ్రెస్‌ నేత విహెచ్‌. హన్మంతరావు
హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : నాలుగేళ్లు ప్రజావ్యతిరేక, దొరలపాలన సాగించిన కేసీఆర్‌ ను గద్దె దించేందుకు మహాకూటమితో బరిలోకి దిగుతున్నామని టీ-కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (వీహెచ్‌) అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమిలో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని, ఒకవేళ కొన్ని సీట్ల త్యాగానికైనా సిద్ధమవ్వాలని టీడీపీ నేతలకు సూచించడం హర్షణీయమని అన్నారు.  మహాకూటమిలోని మిగిలిన పార్టీలు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), సీపీఐ లు కూడా ఆ దిశగా సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కేసీఆర్‌ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును కేసీఆర్‌ ఎంత తిట్టినా ఒక్క మాట కూడా బాబు మాట్లడలేదని అన్నారు. బీసీలకు సంబంధించి ఢిల్లీ సమావేశానికి తనను పిలవకపోవడంపై స్కీన్రింగ్‌ కమిటీ సభ్యులైన భక్త చరణ్‌దాస్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అడుగుతానని చెప్పారు. తనతో పాటు పొన్నాల లక్ష్మయ్య, ఆనంద్‌ భాస్కర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో వారు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరతామన్నారు. ఒక్కో పార్లమెంటు
నియోజకవర్గ పరిధిలో రెండేసి సీట్ల చొప్పున అడుగుతున్నట్లు వీహెచ్‌ తెలిపారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని వీహెచ్‌ స్పష్టం చేశారు.

Other News

Comments are closed.