కేసీఆర్‌వి ఝూట మాటలు

share on facebook

– నమ్మకండి

– ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి): 2014లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హావిూలను ఒక్కటి కూడా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నెరవేర్చలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం ఇక్కడ విూడియా సమావేశంలో మాట్లాడుతూ…’సింగరేణి కార్మికులకు 2014లో సొంత ఇల్లు అన్నారు. మొన్న రూ.10 లక్షల లోన్‌ అన్నారు. ఇప్పుడు రూ.6 లక్షల లోన్‌ అంటున్నారు. సొంత ఇల్లు హావిూని నిలబెట్టుకోవాలి. కేసీఆర్‌ అబద్ధపు ప్రచారం ఆపాలి. సింగరేణి, భూపాలపల్లి ప్లాంట్‌లు కాంగ్రెస్‌ హయాంలో ఏర్పడ్డాయి. సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతో టీఆర్‌ఎస్‌ నేతలు నోట్ల బస్తాలు, లిక్కర్‌ ఎందుకు పంచి పెడుతున్నారు. పండగ అడ్వాన్స్‌ ఇవ్వడంలో గొప్పేవిూ ఉంది’ అని ప్రశ్నించారు.

 

Other News

Comments are closed.