కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా

share on facebook

– కానీ నాకు అన్యాయం చేశాడు
– కంట తడిపెట్టిన బాబూమోహన్‌
సంగారెడ్డి, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా.. కానీ తనకు అన్యాయం చేశాడంటూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూమోహన్‌ కంట తడి పెట్టుకున్నాడు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బాబూమోహన్‌ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం విధితమే.  ఈ సందర్భంగా గురువారం సంగారెడ్డిలో బాబూమోహన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఆందోల్‌
టికెట్‌ తనకు కేటాయించకుండా తనకు అన్యాయం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. టీఆర్‌ఎస్‌ తాజాగా బరిలోకి దించిన క్రాంతి కిరణ్‌ ఏనాడు టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు. లోకల్‌ అభ్యర్థికే టికెట్‌ ఇస్తామంటే గతంలో నాకెందుకు టికెట్‌ ఇచ్చారని కేసీఆర్‌ను బాబూమోహన్‌ ప్రశ్నించారు. నేనేం తప్పుచేశాను… చెప్పుడు మాటలు విని టికెట్‌ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ ను నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నానని, నేనేం తప్పుచేసానని ప్రశ్నించారు. కేసీఆర్‌ వేసిన శిక్ష న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చెప్పులు వేసుకునే టైమ్‌ కూడా ఇవ్వలేదన్న బాబుమోహన్‌.. ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారని, ఎమ్మెల్యే గా 25ఏళ్ల క్రితం అయిన నేను ఇంకా లోకల్‌ కాదా అని ప్రశ్నించారు. నేను తెలంగాణలోనే పుట్టానని, నేను ఎలాచూసినా లోకల్‌ లే అన్నారు. నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడు చూసుకుంటారంటూ శాపనార్థాలు పెట్టారు. బీసీ, ఎస్సీలకు కేసీఆర్‌ ఏంలాభం చేశారని ప్రశ్నించారు. బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని… దళితున్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ విూడియా సమావేశంలో బాబూమోహన్‌ కంటతడి పెట్టారు.

Other News

Comments are closed.