కేసీఆర్‌ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి

share on facebook

హైదరాబాద్: వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం డాక్టర్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. డీజీపీ మహేందర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ ఎక్కడికి వెళ్లాయి..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్‌ కర్కశ హృదయుడని.. ప్రియాంక ఘటనపై ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రులు అసలు మనుషులేనా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Other News

Comments are closed.