కొంగర కలాన్‌ వాపుమాత్రమే: టిడిపి

share on facebook

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ కొంగరకలాన్‌లో రెండో తేదీన నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వచ్చిన జనాలను చూపి తమకు ప్రజల మద్దతు ఉందని భ్రిమిస్తోందని టిడిపి దుయ్యబ్టటింది. ఈ సభ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయిందని, సీఎం కేసీఆర్‌ సభ నిర్వహణపై ఎన్నో ప్రగల్భాలు పలికారని, ఆయన ఊహించిన దాంట్లో మూడో వంతు కూడా ప్రజలు సభకు హాజరు కాలేదని టిడిపి పోలీటి/- బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రసంగంలో కొత్తదనమేమి లేకపోగా తెరాస శ్రేణులే నివ్వెర పోయారని అన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కేంద్రం విూదకు ప్రజలను ఉసిగొల్పేందుకు ప్రాంతీయవాదాన్ని తీసుకువస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్‌ తన పద్ధతిని మార్చుకోవాలన్నారు. కోట్లు ఖర్చుపెట్టి జనాలను తీసుకొచ్చినా ఎలాంటి ప్రగతి కనిపించలేదని అన్నారు. పేదలందరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్‌ హావిూని నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమి హామి ఏమైందన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారని, తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్లకు మాత్రమే ఉద్యోగాలు దొరికాయన్నారు. కేసీఆర్‌ పాలన మొత్తం అవినీతిమని విమర్శించారు. తిరిగి టీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా లేరని, ప్రగతి నివేదన సభతో ఆవిషయం స్పష్టమైందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధమేనని, ప్రజల ఆశ్వీరదీస్తే అంతిమ విజయం తమదేనని స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు ఖరారైన లేకున్నా, ఏకపక్ష్యంగానైనా టీడీపీకి చెక్కుచెదరని బలముందని, టీడీపి ఓటు బ్యాంకు ఎక్కడికీ వెళ్లలేదన్నారు.

 

Other News

Comments are closed.