కొత్త కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు జిల్లాతో అనుబంధం

share on facebook

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): జిల్లా కలెక్టర్‌గా డీ అమయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనకు జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి పోలీస్‌ అధికారిగా ఇక్కడ వివిధ ¬దాల్లో పనిచేశారు. అమయ్‌కుమార్‌ 2007లో గ్రూప్‌1 అధికారిగా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా తొలి పోస్టింగ్‌లో చేరారు. తరువాత జగిత్యాల ఆర్డీవోగా పనిచేసి బదిలీపై కొత్తగూడెం ఆర్డీవోగా 2012-14 వరకు పనిచేశారు. ఇక్కడి నుంచి పదోన్నతిపై ఐటీడీఏ పీవోగా ఏటూరు నాగారంలో పనిచేస్తూ, కొత్తగా ఏర్పాటైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. 2017లో ఐఏఎస్‌గా కన్‌ఫర్డ్‌ అయ్యారు. భూపాలపల్లిలో కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆకునూరి కనకరాజు బదిలీ కావడంతో ఆయన స్థానంలో అమయ్‌కుమార్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడపనిచేస్తూ బదిలీపై కొత్తగూడెం కలెక్టర్‌గా రానున్నారు. అమయ్‌కుమార్‌ తండ్రి అశోక్‌కుమార్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కన్‌ఫర్మ్‌ ఐపీఎస్‌ అయ్యారు. ఈ విధంగా జిల్లాతో కొత్తగా వస్తున్న కలెక్టర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.

 

Other News

Comments are closed.