నిర్వీర్యం చేసే లోపే ఘటన
కొలంబో,ఏప్రిల్22(జనంసాక్షి): వరుస బాంబు దాడుల కలకలాన్ని మర్చిపోక ముందే కొలంబోలోని మరో చర్చి వద్ద పేలుడు సంభవించింది. చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలిసి దాన్ని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలు నిర్వీర్యం చేసేలోపు అది ఒక్కసారిగా పేలింది. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన దారుణ కాండతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం వద్ద ముష్కరులు అమర్చిన బాంబులను గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కొలంబోలోని ప్రధాన బస్టాండ్లో 87 డిటోనేటర్లను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించామని, సమయానికి గుర్తించకపోయి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. పెద్ద పెద్ద ¬టళ్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. దీంతోపాటు ¬టళ్లలో నియమించుకునే సిబ్బంది, అక్కడకు వచ్చే అతిథుల వివరాలు పూర్తిగా విచారించి, వారి ధ్రువీకరణ పత్రాల్లో వాస్తవికతను తెలుసుకుని వారిని లోపలికి అనుమతించాలని ఆ దేశ టూరిజం శాఖ కొలంబోలోని 150 ప్రధాన ¬టళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా అనుమానాలు వ్యక్తమయితే వారి వివరాలు నిక్షిప్తం చేసుకోవాలని కోరింది.
కొలంబోలో పేలిన మరో బాంబు
Other News
- నిర్భయ దోషులకు 16న ఉరి?
- ప్రత్యేక¬దాను తాకట్టు పెట్టిందే చంద్రబాబు
- భూ వివరాల్లో చాలా తేడాలున్నాయి
- జగన్రెడ్డి చేసే మేలు ఉల్లి కూడాచెయ్యదు!!
- ఆంధప్రదేశ్ మహిళాంధ్రప్రదేశ్గా మారాలి
- యడియూరప్ప సర్కార్ సేఫ్!
- రూ.25కే ఉల్లిని అందిస్తున్నాం
- మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఉల్లి ధరలపై సీఎం సవిూక్షిస్తున్నారు
- ఈనెల 17వరకు అసెంబ్లీ సమావేశాలు