కోకోసాగులో ఆంధప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): అంబాజీపేట రానున్న రోజుల్లో కోకో సాగులో ఆంధప్రదేశ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని సెంట్రల్‌ ప్లానిటేషన్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా.పీ చౌడప్ప అన్నారు. అంబాజీపేట మండలం ముక్కాములలో అభ్యుదయ కర్షక పరిషత్‌ భవనంలో సీపీసీఆర్‌ఐ, హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ /-టసేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సు జరిగింది. ‘కొబ్బరి, కోకో సాగు-వ్యవసాయంలో రైతుల భాగస్వామ్యం’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు డా.వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డా.బీఎస్‌ఎన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ల్మడప్ప పలు అంశాలపై రైతులకు పలు సూచనలు చేశారు. మహేశ్వరప్ప, తంబన్‌, సుజాత, ఏ సుజాత, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.