కోడెలతో మధుసూధనాచారి  భేటీ

share on facebook

ఇద్దరిదీ ఆత్మీయ అనుబంధమని వెల్లడి
గుంటూరు,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసుదనాచారి అనుకోకుండా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఇంటికి వెళ్లారు. తెలంగాణ స్పీకర్‌ మధుసుదనాచారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నారు. మార్గమధ్యలో ఉన్న ఏపీ స్పీకర్‌ కోడెల ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా కోడెల కుటుంబ సభ్యుల నుంచి వారికి సాదర స్వాగతం లభించింది. కాగా… తిరుమలతోపాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ప్రోటోకాల్‌ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్‌ కోడెల ఆదేశించారు. ఇదిలావుంటే ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్రంలో తాము ఇద్దరం కలిసి పనిచేశాం… గతంలో ఒకే పార్టీలో పనిచేసిన మా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి…’ అంటూ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ స్పీకర్‌ సిరికొండ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ… మార్గమధ్యలో గల ఏసీ స్పీకర్‌ కోడెల ఇంటికి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక విలేకరులు అక్కడికి వెళ్ళి కలిశారు. ఈ సందర్బంగా ఇరువురు స్పీకర్లు విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయినా రెండు రాష్టాల్రు సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. అలాగే ఇరు రాష్టాల్ర మధ్య పరస్పర అవగాహన ఉందన్నారు. శాసనసభ వ్యవహారాలలో ఇద్దరం సమన్వయంతో పని చేస్తున్నామని వారు అన్నారు. ఇది మంచి సంప్రదాయమని అన్నారు.

Other News

Comments are closed.