కోర్టుతీర్పుపైనే కాంగ్రెస్‌ ఆశలు

share on facebook

 ప్రభుత్వ ధిక్కారాన్ని నిరసిస్తూ కోర్టుకెళ్లిన కోమటరెడ్డి, సంపత్‌లు
పిటిషన్‌పై నేడు విచారణ
హైదరాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్‌ కోర్టునే నమ్ముకుంది. ఇప్పటికి రెండు సార్లు తీర్పు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ధిక్కారం కింద కాంగ్రెస్‌ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కోమటిరెడ్డి, సంతప్‌ కుమార్‌ల సభ్యత్వ రద్దుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకే కాంగ్రెస్‌ నిర్ణయించింది. కోర్టు తీర్పు అమలు చేయకుండా మొండికేస్తున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేసింది. కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేయాల్సి ఉంటుంది. కానీ వ్యూహాత్మంగా అడుగులు వేసిన కాంగ్రెస్‌ అసెంబ్లీ కార్యదర్శని ప్రతివాదిగా చేసింది. దీంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుందన్నది కాంగ్రెస్‌ వ్యూహం. కోర్టు తీర్పు అమలు చేయాల్సింది స్పీకర్‌ అయితే… ఆయన కోర్టు తీర్పును అమలు చేయలేదు కాబట్టి కోర్టు ధిక్కారణ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినా.. ఆయన వాటిని తీసుకుంటారా? తీసుకున్నా అపీళ్లు చేస్తారా? ఇలా పలు అంశాలు ప్రశ్నలుగానే మిగిలిపోయేవి. అందుకే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ కార్యదర్శిని పావుగా ఎంచుకున్నట్లు సమాచారం. ఆయనను ప్రతివాదిగా చేయడంతో బాధ్యత పూర్తిగా ఆయనపై పడుతుంది. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి…

Other News

Comments are closed.