కోహ్లకి షాకిచ్చిన నయా బౌలర్‌

share on facebook

వామప్‌ మ్యాచ్‌లో విరాట్‌ వికెట్‌ తీసిన ఆరోన్‌ హర్డీ
సిడ్నీ,నవంబర్‌ 29 (జ‌నంసాక్షి) : టీమిండియా కెప్టెన్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రన్‌ మెషీన్‌ పరుగుల దాహానికి అడ్డు లేకుండా పోతున్నది.
కీలకమైన ఆస్టేల్రియా టెస్ట్‌ సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న విరాట్‌.. అందుకు తగినట్లే వామప్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 64 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడని ఓ అనామక బౌలర్‌కు తన వికెట్‌ ఇచ్చుకున్నాడు. వెస్టర్న్‌ ఆస్టేల్రియా పేస్‌ బౌలర్‌ ఆరోన్‌ హార్డీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు. విరాట్‌లాంటి పరుగుల యంత్రాన్ని ఔట్‌ చేసిన హార్డీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో హార్డీ 13 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వెస్టర్న్‌ ఆస్టేల్రియా అండర్‌-17, అండర్‌-19 టీమ్స్‌కు కెప్టెన్‌ అయిన హార్డీ.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మాత్రం ఇంకా ఆడలేదు..

Other News

Comments are closed.