క్రీడాకారులకు  జాగృతి అండ

share on facebook

నిజామాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతకు ప్రోత్సాహం అందించనట్లవుతుందన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జాగృతి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో పోటీలు ఏర్పాటు చేశామని అన్నారు. టీమ్‌లను ఎంపిక చేయడం వల్ల క్రీడాకారులకు ప్రోత్సాహం అందుతుందన్నారు. జిల్లా స్థాయిలో
క్రీడాకారులు సత్తా చూపించాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం, మహిళలకు కుట్లు, బ్యూటీషియన్‌ కోర్సులు.. ఇలా అనేక కోర్సులు నేర్పించి జాగృతి వారికి అండగా నిలవడం అభినందనీయమన్నారు.

Other News

Comments are closed.