ఖైదీలు సత్ప్రవర్తనతో జీవించాలి

share on facebook

సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్ సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్
* వికలాంగులకు  పండ్లు పంపిణీ
* ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
* జిల్లా అదనపు కలెక్టర్  గరిమా అగర్వాల్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి  )  :ఖైదీలు కారాగారం నుండి విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో సమాజంలో కలిసిపోయి ఉన్నత జీవితం గడపాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. దేశంలో సోదర, సోదరిమణుల ప్రేమకు ప్రతికగా జరుపుకునే రక్షాబంద్ కార్యక్రమాన్ని జాతీయ సమైక్యతను చాటుకునేలా నిర్వహించుకోవడం జరుగుతుందని  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.శుక్రవారం మహిళా శిశు వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మరియుడిఆర్డిఎ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఏజ్ హోమ్, బస్స్టాండ్ , జిల్లా కారాగారంలో నిర్వహించిన జాతీయ సమైక్యత  రక్షాబందన్ వేడుకలలో ఆమె అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ,  75 సంవత్సరాల స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో బాగంగా జిల్లాలో పెద్దఎత్తున రక్షాబందన్ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని, సోదర సోదరీమణుల ఆప్యాయత, అనురాగాలకు ఈ పండుగ ప్రతీకగా రాఖీ పండుగ అని పేర్కోన్నారు.   ఈ సందర్బంగా ఆమె పలువురికి రాఖీలు కట్టి పండ్లను పంపిణి చేశారు.  జిల్లా జైలు లో  నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఖైదీలు కారాగారం నుండి విడుదల అయిన తరువాత సమాజంలో కలిసిపోయి సత్ప్రవర్తనతో ఉన్నత జీవితం గడిపేలా ముందుకు సాగాలన్నారు. అనంతరం బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోని, ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, నిత్యం సంబంవించే మరణాలలో రోడ్డు ప్రమాదం ద్వారానె ఎక్కువగా మరణాలు సంబవిస్తున్నాయని,  ముఖ్యంగా యువత ప్రమాదాలను నివారించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాట్లాడుతూ వృద్ధుల సమక్షంలో రాఖీ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వికలాంగులను ఆప్యాయంగా పలకరించి అందరికీ ఆమె పండ్లు పంపిణీ చేశారు. బాల సదన్ చిన్నారుల కారాగారంలోని ఖైదీలకు రాఖీలు కట్టారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వి.పద్మావతి, డిఆర్డిఎ పిడి శ్రీలత. డి.ఎం. హెచ్.ఓ డాక్టర్ జువేరియా, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, సిడిపిఓలు సబితాకుమారి, కస్తూరి, ఉమారాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.