గంగమ్మ జాతరలో పాల్గొన్న సోమారపు

share on facebook

పెద్దపల్లి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో వుందని ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. గంగపుత్రుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగాపుత్రుల గంగమ్మ తల్లి బోనాల జాతరలొ ఆయన పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మహిళలతో కలసి అమ్మవారి బోనం ఎత్తుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గంగ పుత్రుల అబివృద్ధికి కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా వుండాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నిరంతరంగా నీటి ప్రవాహం ఉంటుందని, ముదిరాజ్‌ మరియు గంగ పుత్రులకు చేపలు పట్టుకోవటానికి పనిముట్లు అందిస్తామని తెలిపారు.

Other News

Comments are closed.