గంజాయి పంటలపై నిఘా

share on facebook

కాకినాడ,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జాతీయరహదారిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించిన ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారితో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడంతోవారి ఉనికి చాటుకోడానికి కొన్ని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అయితే కొత్తతరహా ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. వీటి పట్ల ప్రజలు అప్రత్తంగా ఉంచేలా పోలీసులతో ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లిలో ప్రతి దుకాణం ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

 

Other News

Comments are closed.