గణెశ్‌ మండపాలకు అనుమతులు తప్పనిసరి

share on facebook

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లాలో వినయాకమండపాలకు అనుమతులు తప్పనిసరని ఎస్పీ అన్నారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటుచేస్తే తొలగిస్తామని అన్నారు. వినాయక శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాల్లో ఏరోజు నిమజ్జనం చేస్తారో స్థానిక పోలీసులకు తెలియజేయాలని నిర్వాకులను కోరారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యమని అన్నారు. మండపాల ఏర్పాటుపై సంబంధిత ఠాణాల్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. అనధికారికంగా విద్యుత్తు కనెక్షన్లు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం రోజున మద్య నిషేధం అమలు చేయాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా శాంతికమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆర్డీవోలకు సూచించారు.

 

Other News

Comments are closed.