గర్భిణిని హతమార్చిన అత్తింటి వారు

share on facebook

రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఐదు నెలల గర్భిణి హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన శిరీష (23), చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన శేఖర్‌కు ఇచ్చి 2017 జూన్‌లో పెళ్లి చేశారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం శిరీషను అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారు. ఆదివారం రాత్రి అత్తింటిలో శిరీషను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శిరీష హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Other News

Comments are closed.