గవర్నర్‌ నరసింహన్‌తో బాబు భేటీ

share on facebook

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల  గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం  ఉదయం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు.. గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో ఉండనున్న చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. గురువారం రాత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌ హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఎన్‌ఇనకల ఫలితాల తరవాత బాబు గవర్నర్‌ను కలవడం ఇదే మొదటి సారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బాబు తన విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.

Other News

Comments are closed.