గవర్నర్‌ నరసింహన్‌ను క‌లిసిన‌ కేసీఆర్

share on facebook

హైద‌రాబాద్(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లిశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం, తెలంగాణ కంటి వెలుగు కార్య‌క్ర‌మాల గురించి గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ వివ‌రించారు. ఆగ‌స్టు 15న కంటివెలుగు కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో పాల్గొనాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో తాజా ప‌రిణామాల‌పైనా గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించారు. ఇటీవ‌ల ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రాధాకృష్ణ‌న్‌ను ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

Other News

Comments are closed.