గిరిజనులకు వరంగా మారిన కంటివెలుగు

share on facebook

నల్లగొండ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్న కంటి వెలుగు కార్యక్రమం మండలంలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తండాల్లో నిర్వహిస్తున్న శిబిరాలన్ని ఉపయోగించు కుంటున్నారు. పరీక్షలు చేయించుకున్నవారికి కళ్లద్దాలను అందజేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే కోరారు. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిందని దీనిని ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకపోతే చదువుకోవడం ద్వారావిద్యార్థి తన మేదస్సును పెంచుకున్నట్లే నాటిన ప్రతి మొక్క ను అంతే స్థాయిలో రక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పలుచోట్ల ఆయన మొక్కలు నాటి గ్రామస్థులను ప్రోత్సహించారు. పలువురు మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. గిరిజన గురుకుల కళాశాల, పాఠశాలల్లో మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి పాఠశాల, కళాశాల ఆవరణలో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హరిత పాఠశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Other News

Comments are closed.