గిరిజన గూడాలకు మెరుగుపడని రహదారి సౌకర్యాలు

share on facebook

నిర్మల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి అమ్మడం ద్వారా వారికి లబ్ది చేకూరేలా చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూగిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న కృషి మంచి ఫలితాలు ఇస్తోంది. వారు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేస్తోంది. మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను కొనుగోలు చేసి వారికి గిట్టు బాట ధరను చెల్లించాలనే సంకల్పానికి అనుగుణంగా ఐటిడిఎ కృషి చేస్తోంది. అయితే రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడం, ఎత్తైన ప్రదేశం ఉండడంతో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమిం చేందుకు మారుమూల గ్రామాల గిరిజనుల ఇంటింటికి నిత్యావసర సరుకులను సరఫరా చేస్తోంది. గిరిజనులు అడవుల నుంచి సేకరించే బంక, తేనే, ఇప్పపువ్వు, ఇప్పపరక, మైనం తదితర కలపేతర వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరను చెల్లించి కొనుగోలు చేయడంతోపాటు మారుమూల గిరిజన గ్రామాలు, తండాలలో నివసించే అడవిబిడ్డలకు అవసరమైయ్యే నిత్యావసర సరుకులను చౌకధరలకే డీఆర్‌డిపోల ద్వారా సరఫరా చేస్తోంది.మార్పులకు అనుగుణంగా జీసీసీని బలోపేతం చేస్తున్నారు. గిరిజనలు అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంతోపాటు వారి అభివృద్ధి లక్ష్యంగా కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. అధికారుల కృషిఫలితంగా ప్రగతి దిశలో పయనిస్తోంది. ఐటిడిఎ అందిస్తున్న ప్రోత్సహం వల్ల సంస్థలోని అన్ని సొసైటీల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా గిరిజన సహకార సంస్థ కొత్త కొత్త ఆలోచనతో ముందకెళ్తొంది. గతేడాది ప్రారంభించిన కొత్త కార్యక్రమాలు అన్ని విజయవంతంగా నడుస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాంరు. గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర సరకులు, కాస్మోటిక్స్‌లు, వివిధ ఆహార పదార్థాలు ఎమ్మార్పీ ధర కంటే తక్కువకు అందించి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన సూపర్‌ బజార్‌ మంచి ఫలితాలు ఇస్తోంది. నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ఈ సేవను వినియోగించు కుంటున్నారు.

Other News

Comments are closed.