గిరిజన యువతకు ఉచిత శిక్షణ గిరిజన యువతకు ఉచిత శిక్షణ 

share on facebook

ఆదిలాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌ అన్నారు.పోలీసులపై సమాజ రక్షణ బాధ్యత ఉందని ఆదివాసీ గిరిజన పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్‌ శాఖ తరపున శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గిరిజన యువకులకు ఉచితంగా శిక్షణ కల్పించనున్నట్లు వివరించాన్నారు. సమాజంలో కొంత మంది కావాలని సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని సూచించారు. సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు.

Other News

Comments are closed.