గుజరాత్‌ ఎన్నికల్లో పాక్‌ జోక్యం

share on facebook

– ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 10,(జనంసాక్షి): గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో పాకిస్థాన్‌ జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేశారు. గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో మోదీ రెండో దశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ బహిష్కృత నేత మణిశంకర్‌ అయ్యర్‌పై ప్రధాని మోదీ విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆయన్ను ఇరకాటంలోకి నెడుతూ ఘాటు ప్రశ్నను సంధించారు. పాకిస్థాన్‌ హైకమిషనర్‌తో రహస్య సమావేశాలు ఏంటంటూ ప్రశ్నించారు.ఇటీవల మోదీనుద్దేశిస్తూ ‘నీచ్‌ ఆద్మీ’ అంటూ మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. తనను అడ్డు తొలగించడానికి అయ్యర్‌ పాకిస్థాన్‌లో సుపారీ ఇచ్చారంటూ ఆరోపించారు. తాజాగా బనస్కాంతలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన్ను టార్గెట్‌ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీతో కలిసి భారత్‌లో పాక్‌ హైకమిషనర్‌ సోహైల్‌ మహ్మూద్‌ను కలిశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థానీయులతో రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పాకిస్థాన్‌ ఆర్మీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అర్షద్‌ రఫిక్‌.. అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు హావిూ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు గొంతునొప్పితో బాధపడుతున్నప్పటికీ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. సరిగ్గా మాట్లాడే స్థితిలో లేప్పటికీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రసంగం చివర్లో భాజపాను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. గుజరాత్‌లో ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరగ్గా.. రెండో విడత పోలింగ్‌ ఈ నెల 14న జరగనుంది. మొత్తం 182 స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 18న వెలువడనున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ నేతలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు భేటీ అయ్యారని మోదీ ఆరోపించారు. పాక్‌ నేతలతో కాంగ్రెస్‌ నేతల భేటీపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ప్రధాని డిమాండ్‌ చేశారు. ప్రధాని నీచమైన వ్యక్తి అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించడంపై మోదీ నిప్పులు చెరిగిన విషయం విదితమే. పాక్‌ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే అయ్యర్‌ తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారని మోదీ పేర్కొన్నారు. మణి శంకర్‌ అయ్యర్‌ నివాసంలో పాక్‌ హై కమిషనర్‌, పాకిస్థాన్‌ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సమావేశమైనట్లు శనివారం విూడియాలో కథనాలు వచ్చాయని ప్రధాని తెలిపారు. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగిందని మోదీ చెప్పారు. పాక్‌ నేతలతో కాంగ్రెస్‌ నేతల భేటీని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. దీనిపై భారత ప్రజలకు కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని మోదీ డిమాండ్‌ చేశారు.కాగా తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ బహిష్కృత నేత మణిశంకర్‌ అయ్యర్‌పై ప్రధాని మోదీ విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆయన్ను ఇరకాటంలోకి నెడుతూ ఘాటు ప్రశ్నను సంధించారు. పాకిస్థాన్‌ హైకమిషనర్‌తో రహస్య సమావేశాలు ఏంటంటూ ప్రశ్నించారు.ఇటీవల మోదీనుద్దేశిస్తూ ‘నీచ్‌ ఆద్మీ’ అంటూ మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. తనను అడ్డు తొలగించడానికి అయ్యర్‌ పాకిస్థాన్‌లో సుపారీ ఇచ్చారంటూ ఆరోపించారు. తాజాగా బనస్కాంతలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన్ను టార్గెట్‌ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీతో కలిసి భారత్‌లో పాక్‌ హైకమిషనర్‌ సోహైల్‌ మహ్మూద్‌ను కలిశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థానీయులతో రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పాకిస్థాన్‌ ఆర్మీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అర్షద్‌ రఫిక్‌.. అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు హావిూ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు గొంతునొప్పితో బాధపడుతున్నప్పటికీ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. సరిగ్గా మాట్లాడే స్థితిలో లేప్పటికీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రసంగం చివర్లో భాజపాను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. గుజరాత్‌లో ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరగ్గా.. రెండో విడత పోలింగ్‌ ఈ నెల 14న జరగనుంది. మొత్తం 182 స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 18న వెలువడనున్నాయి.

Other News

Comments are closed.