గుజరాత్‌ నైతిక విజయం కాంగ్రెస్‌దే

share on facebook

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయినా నైతిక విజయం తమదేనని డిసిసి అధ్యక్షులు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కేవలం తొమ్మిది సీట్ల తేడాతోనే కాంగ్రెస్‌కు అధికారం దూరమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇదే పొరాట స్ఫూర్తిని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల భావోద్వేగాలతో బిజెపి అనైతిక రాజకీయలకు పాల్పడిందని విమర్శించారు. కీలక దశలో పార్టీ బాధ్యతల్ని రాహుల్‌ గాంధీ భుజానికెత్తుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగల సత్తా ఆయనకే ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చే కుటుంబం వారిదేనన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందన్నారు.

Other News

Comments are closed.