గుట్కా వ్యాపారులపై దాడులు

share on facebook

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో గుట్కా, మట్కా, క్రయవిక్రయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వ్యాపారులను హెచ్చరించారు.  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గుట్కా రవాణాపై నిఘా పెంచారు. వివిధ ప్రాంతాల్లో దాడులుచేసి గుట్కాను  సీజ్‌ చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేటపట్టారు.గుట్కా ప్యాకెట్లను, పట్టుబడిన ముగ్గురు వ్యాపారులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్ల డీసీపీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ తెలిపారు.

Other News

Comments are closed.