గుడంబా నిర్మూలనకు కృషి: ఎమ్మెల్యే మదన్‌లాల్‌

share on facebook

ఖమ్మం,జూలై10(జ‌నం సాక్షి):గుడుంబా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. తండాల్లో ఎవరూ గుడుంబాను తయారు చేయవద్దని కోరారు. ప్రభుత్వం గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస పథకంలో భాగంగా ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ట్రైకార్‌ శాఖ ఆర్థికసాయంతో ప్రోత్సాహం అందిస్తోందిన అన్నారు. గుడుంబా తయారీనే జీవనాధారమైన కుటుంబాకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీపై రెండు లక్షలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని చూసించారు. మొదటిగా మూడు కిరాణా దుకాణాలకు నిధులు మంజూరు చేశారు. గ్రామాల్లోని మహిళలు, యువకులు గుడుంబాను నియంత్రించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

 

Other News

Comments are closed.