గురుకులాలతో గిరిజనులకు నాణ్యమైన విద్య

share on facebook

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమపాఠశాలలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని భద్రాచలం ఐటీడీఏ డీటీడీఓ రాంమూర్తి స్పష్టం చేసారు. నాణ్యమైన తెలుగు, ఇంగ్లీషు బాషల బోదనలో ఉపాధ్యాయులు పనితీరును ప్రదర్శించి ఉత్తీర్ణతాశాతంలో ముందు వరుసలో వున్నారని తెలిపారు. గిరిజనలుకు ఇదొక సదవకాశంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతి సౌకర్యాలతో కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా అశ్రమపాఠశాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఆశ్రమపాఠశాలలో మెరుగైన ఫలితాలలో అగ్రభాగాన పనిజేస్తున్నాయని వివరించారు. అదే విదంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి కారణంగా గిరిజన విద్యాభివృద్దికి బాటలు వేస్తున్నారని ఆయన స్పష్టం జేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉన్నత విద్యకు ప్రోత్సహించటం గిరిజన విద్యార్థులకు అదృష్టం అన్నారు. గండుగులపల్లిలో ఏకలవ్య గురుకుల పాఠశాల, అంకంపాలెంలోని గిరిజన మహిళా కళాశాల మంజూరయ్యాయని చెప్పారు. ఈ సంస్థలు ప్రసుత విద్యా సంవత్సరంలో ప్రారంభమై సక్రమంగా నడుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. స్థానికంగా నాయకులు, ప్రజాప్రతి నిధుల సహకారమే దమ్మపేట మండలానికి రాష్ట్రస్ధాయిలో గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం జేసారు.

Other News

Comments are closed.