గోదావరి జలాలతో చెరువులకు కళ 

share on facebook

జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): దేవాదుల పథకంలో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా చిలుపూరు మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి  గోదావరి జలాలను మండల కేంద్రంలోని  చెరువుల్లోకి తరలిస్తున్నారు.  చెరువులు గోదావరి జలాలతో నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సాగుకు డోకా లేదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నా రు.  మండలకేంద్రంలోని నాగుల చెరువుతో పాటు, బర్రెంకుల చెరువులు నిండి అలుగు పోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో చెరువులు నిండడంతో యాసంగికి డోకా లేదని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా చెరువుల్లోకి గోదావరి జలాలు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్యకు రైతుల కృతజ్ఞతలు తెలుపుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రైతులకు న్యాయం జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.

Other News

Comments are closed.