గోల్కోండకోటపై తళుక్కుమన్న ఇవాంక

share on facebook

– కాలినడకనే 46నిమిషాల పాటు కోట అందాలను తిలకించిన ట్రంప్‌ తనయ

– కోట చరిత్రను వివరించిన గైడ్స్‌

– అద్భుతం కట్టడం.. చరిత్రను కాపాడాలని కోరిన ఇవాంక ట్రంప్‌

హైదరాబాద్‌,నవంబర్‌ 29,(జనంసాక్షి): ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు ముఖ్య అతిథిగా

హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించారు. కోటలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3గంటల8నిమిషాలకు ఇవాంక గొల్కొండ కోటలోకి వెళ్లిన ఇవాంక 3.54గంటలకు అక్కడి నుండి బయలుదేరారు. దాదాపు 46 నిమిషాలు ఇవాంక కోటలో పర్యటించారు.. కట్టదిట్టమైన భద్రతల నడుమ కోటలోకి ప్రవేశించిన ఇవాంకాకోసం అధికారులు బ్యాటరీ కారులను ఏర్పాటు చేశారు.. కానీ ఇవాంక వాటిల్లో కాకుండా కాలినడకనే కోటను తిలకించారు. గోల్కొండ కోటలోని ప్రతి ప్రాంతానికి వెళ్లిన ఇవాంక వాటి విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. కోట చరిత్రను తెలంగాణ సీఎస్‌, మరో ఇద్దరు గైడ్స్‌ ఇవాంకాకు వివరించారు. కోటలోని రాణిమహల్‌లాంటి కట్టడాలను చాలా ఆసక్తిగా తిలకించారు. రాత్రి సమయంలో విందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌, గోల్కొండ కోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ఆమె వీక్షించారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే డిజిటల్‌ ప్రదర్శనను ఇవాంక తిలకించారు. అమెరికా ప్రతినిధులందరూ ఇవాంకా వెంట ఉన్నారు.. ఈ సందర్భంగా కోట అందాలను, కట్టడాలను చూసి ఇవాంక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కట్టడాలు తాను ఎప్పుడూ చూడలేదని.. పురాతన కట్టడం చాలా అద్భుతంగా ఉందని అధికారులతో పేర్కొన్నారు. చరిత్రకు ప్రతిబింభంగా ఉండే ఇలాంటి కోటలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. కోటపై పలు ప్రాంతాల్లో నెర్రలువారటాన్ని చూసిన ఇవాంక వాటి గురించి అడిగారు.. దీంతో పురాతన కట్టడం కావటంతో పగుళ్లు వచ్చినట్లు అధికారులు ఇవాంకకు తెలిపారు.. కోటలోని ప్రతి మూలకు వెళ్లిన ఇవాంక కోట కట్టడం అద్భుతంగా ఉందని.. దీనికి కాపాడుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది..

కట్టుదిట్టమైన భద్రత..

ఇవాంక గోల్కొండ కోటలోకి వెళ్లేకంటే ముందుగానే తెలంగాణ పోలీస్‌లతో పాటు యూఎస్‌సీక్రెట్‌ ఏజెంట్స్‌ గోల్కొండకోటలో తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా క్షుణ్ణంగా తనికీలు చేశారు. ఇవాంకా రాకతో 800మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు.. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో రహదారిపై వాహనాలు నిషేదించారు. సుమారు 46నిమిషాలు గొల్కొండకోటలో ఇవాంకా ఉండటంతో పోలీసులు అప్రమత్తమై ఎవరూ అటువైపు రాకుండా ఏర్పాట్లు చేశారు. ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కోటను అందంగా తీర్చిదిద్దింది. ఈ రాత్రి వివిధ దేశాల నుంచి వచ్చిన 1500మంది పారిశ్రామిక వేత్తలకు గొల్కొండ కోటలో విందును ఏర్పాటు చేయనుంది.. ఈ విందులో ఇవాంకా పాల్గొంటారని తొలుత షెడ్యూల్‌లో పేర్కొన్నప్పటికి ఇవాంకా విందులో పాల్గొనలేదు.. గొల్కొండ కోట నుండి నేరుగా ట్రైడెంట్‌ ¬టల్‌కు వెళ్లిన ఇవాంక.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని 8గంటల సమయంలో అమెరికా బయలుదేరి వెళ్లారు.

Other News

Comments are closed.