గ్రామం యూనిట్‌గా పంటల బీమాతో మేలు

share on facebook

గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలుతో రైతులకు మేలు కలుగనుంది. ఇప్పటికే దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. రైతులు కూడా పంటబీమాపై ఆసక్తి చూపుతున్నారు. పంటల సాగుకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న రైతులు వాటికి రక్షణ కోసం వందల రూపాయలు ఖర్చు చేయడంలో అవగాహన లేక పోవడంతో నష్ట పోతున్నారు. వీటిని అంచనా వేసిన ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా బీమా పథకంలో మార్పులు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోతే రైతుల బాధ వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి రాక నష్టపోవాల్సిందే. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే రైతుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. రైతుల ఇబ్బందులు దూరం చేసేందుకు ప్రభుత్వం పంటల బీమాను మరింత సరళతరం చేసింది. గతంలో జిల్లా, మండలం యూనిట్‌గా నష్టపరిహారం అందించేవారు. ప్రస్తుతం గ్రామం యూనిట్‌గా పరిగణిస్తుండ డంతో రైతులకు మేలు చేకూరనుంది. యాసంగి పంటలు సాగు చేసే రైతులు గడువుకు ముందే బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ పంటలకు ప్రీమియం చెల్లించాల్సిన గడువును ప్రకటించింది. శనగ పంటకు నవంబర్‌ 30 వరకు, మొక్క జొన్నకు డిసెంబర్‌ 15 వరకు, వరి, జొన్న, మినుములు, పొద్దు తిరుగుడు, పెసర్లు, వేరు శనగ, మిర్చి, ఆవాలు, ఉల్లి పంటలకు తుది గడువుగా డిసెంబర్‌ 31 వరకు, మామిడికి డిసెంబర్‌ 15 వరకు బీమా ప్రీమియం చెల్లించా లని ప్రకటించింది. ఇందుఏలో భాగంగా పంటల బీమా విషయమై అన్ని గ్రామాల్లో రైతులకు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. . ఇప్పటికే చాలా మంది రైతులు బీమా చేసు కుంటున్నారు. చిన్న రైతుల అంటే పది గుంటలు, 20 గుంటల భూమి ఉన్న వారు బీమా గురించి పట్టించు కోవడం లేదు. రెండు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులు చాలా మంది బీమా చేస్తున్నారు. ఇలా బీమా చేయడంతో నష్టం ఉండదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు రెండు మూడు రోజుల పాటు కురిసే వర్షాలు, తుఫాన్‌లు, వడగండ్ల వానలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పంటలకు నీరు అందించే బోరు బావులు వట్టిపోవడంతో పంటలు ఎండి పోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులు స్తున్నాయి. వీటి నుంచి రైతులను కాపాడటానికి ప్రభుత్వం పంటల బీమా పథకానికి మార్పులు చేసి వారికి ధీమా కల్పిస్తున్నది. వర్షాకాలంలో సరైన వర్షాలు కురువక రైతులు ఇబ్బందులు పడి పంటలు సాగు చేస్తే పంట వచ్చే సమయంలో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వచ్చే తుఫాన్‌ల కారణంగా పంటలు నేలపాలవు తున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో యాసంగి పంటలను అకాల వర్షాలు నాశనం చేస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసే రైతులు అవగాహన లేక పంటల బీమా చేయించు కోవడం లేదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీవ్రంగా నష్ట పోతున్నారు. గతంలో పంటలకు బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే వారే బీమా చేసి ప్రీమియం తీసుకునే వారు. ఇప్పుడు పంటల కోసం రుణం తీసుకోని రైతులు సైతం నేరుగా బీమా చేసుకునే అవకాశం ఉంది. బీమాపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తుండడంతో రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అనుకోని విపత్తులు సంభవించి తీవ్రం గా నష్టపోతున్నారు. పంట చివరి దశలో ఉన్నప్పు డు వచ్చే తుఫాన్‌లు, అకాల వర్షాల కారణంగా పంట నీట మునిగితే రైతన్న జీవితం మసకబారుతోంది. వీటన్నింటి నుంచి రైతన్నకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం బీమా సౌకర్యంలో మార్పులు తీసుకురావడంతో ఎంతో మేలు జరుగనున్నది. జిల్లా, మండలం యూనిట్‌గా ఉన్న పంటల బీమా పథకం ఇప్పుడు గ్రామం యూనిట్‌గా మారడంతో లక్షలాది రైతులకు ధీమా కలిగింది. ముఖ్యంగా వరి పంట కోత దశలో ఏ ఒక్క

వర్షం పడినా పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో కొన్ని సందర్భాల్లో వందలాది ఎకరాలకు చీడ పీడలు వచ్చి పంటలను మింగేస్తున్నాయి. దోమ పోటు వంటి ప్రమాదకర రోగాల కారణంగా కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే వందల ఎకరాల్లో పంట దిగుబడి మూడో వంతుకు పడిపోతున్నది. దోమ పోటును గమనించి అవసరమైన మందులను పిచికారి చేసినప్పటికీ సరైన ఫలితం లేకపోవడంతో చాలా మంది రైతులు పంటను కాల్చి వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు తమను తామే రక్షించుకునే అవకాశం కేవలం పంటలకు బీమా సౌకర్యం చేయడమే. కేవలం ఎకరానికి వందల రూపాయల్లో ఉండే ప్రీమియం కట్టడం కారణంగా జరిగిన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకునే అవకాశం కలుగుతుంది. గతంలో పంటలకు బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే బ్యాంకు వారే పంటలకు బీమా చేసి తీసుకున్న రుణం నుంచి బీమా ప్రీమియం తీసుకునే వారు. ఇప్పుడు పంటల కోసం రుణం తీసుకోని రైతులు సైతం నేరుగా పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు వారు పండించే పంటలకు నేరుగా బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రైతులు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉన్న అధికారుల సహకారంతో వారి పంటలకు ఎంత ప్రీమియం చెల్లించాలనే విషయం తెలుసుకొని వారి సహకారంతో చెల్లించవచ్చు. సాధారణ పంటలకు బీమా ప్రీమియం 1.5 శాతం ఉండగా ఉద్యాన వన పంటలకు మాత్రం 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాతావరణ ఆధారిత పంటలుగా వరి, జొన్న, మొక్క జొన్న, పెసర, మినుము, శనగ, వేరు శనగ, పొద్దు తిరుగుడు, మిర్చి, ఉల్లి, ఆవాల పంటలను గుర్తించారు. వీటిలో ఒక పంటకు గ్రామం యూనిట్‌గా నిర్ణయించి మిగతా వాటిని మాత్రం మండలం యూనిట్‌గా పరిగణిస్తారు. జిల్లాలో ఎక్కువగా సాగు అయ్యే వరి పంటను గ్రామం యూనిట్‌గా, మిగతా పంటలను మండల యూనిట్‌గా తీసుకుంటున్నారు.

Other News

Comments are closed.