గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

share on facebook

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌ బలపర్చినవారే గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలనుఆదర్శంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ, రాబోయే రో జులలో మనమే అమ్మే రోజులు వస్తాయన్నారు. అన్ని గ్రామాలలో ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపడమే ల క్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచులుగా యువతే పెద్ద సంఖ్యలో గెలిచారనీ, ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాలను అభివృధ్ధి చేయాలని ఆకాంక్షించారు. హరిత హారంలో భాగంగా మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు.  బాధ్యతగా సేవ చేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు.

Other News

Comments are closed.