గ్రీటింగ్‌ కార్డుల కవిత్వం

share on facebook

అమెరికాలో కవిత్వం లేదు. లాటిన్‌ అమెరికాలో కవిత్వం వుందని చాలామంది మిత్రులు అంటూ వుంటారు. అది పాక్షిక సత్యమేనని కొన్నిసార్లు అన్పిస్తుంది. ఆవిధంగా అన్పించడానికి కారణం హెలెన్‌ స్పెన్సర్‌ రైస్‌లాంటి కవయిత్రులు. ఈ మధ్యన ఆమె కవిత్వ పుస్తకం ‘ూశీవఎర శీట ఖీaఱ్‌ష్ట్ర చదివాను. ఈ పుస్తకం చదివిన తరువాత నా అభిప్రాయం మారింది.ఆమె కవిత్వం గురిం చి మాట్లాడే ముందు ఆమె గురించి కొంత తెలుసుకుందాం. హెలె న్‌ స్పెన్సర్‌ రైస్‌ కవిత్వం రాయడం మొదలు పెట్టింది 1931లో. ఆమె జీవితకాలం 1900-1981. మొదట మామూలుగా కవిత్వం రాసేది. కానీ భర్త చనిపోయిన తరువాత ఆమె గిబ్సగ్‌ గ్రీటింగ్‌ కార్డుల కంపెనీలో చేరింది. అక్కడ చేరిన తరువాత ఆమె లెక్కలే నన్ని కవితల్ని రాసింది. అవన్నీ లెక్కపెడితే రెండు మిలియన్ల కన్నా ఎక్కువేనని తేలింది.ఆమె స్పృషించని సందర్భం లేదు. జీవితంలోని ప్రతి సందర్భం మీద ఆమె కవిత్వం రాసింది. అవి హాస్యకవితలు, జన్మదిన కవితలు, వివాహ శుభాకాంక్ష కవితలు, సంవత్సరదిన కవితలు, ఫాదర్స్‌డే కవితలు, మదర్స్‌ డే కవితలు. ఇంకా కొన్ని మతపరమైన కవితలు. 1960 సంవత్సరం నుంచి ఆమె చనిపో యే వరకు ఆమె దృష్టి నమ్మకం మీద, ఆశమీద, దయమీద, త్యా గం మీద, నిజాయితీ మీద సారించింది. మనిషి మనుగడకి ఇది అ త్యంత అవసరమని ఆమె భావించింది. క్రస్టయిన్‌ మత ప్రభావం కూడా ఆమె మీద వుండవచ్చు. ఆ విషయానికి వస్తే ప్రతి మతం వీటి గురించి ప్రస్తావిస్తుంది.రైస్‌ తల్లి అనాచీరి స్పైనర్‌. ఆమె ఫిబ్ర వరి 20, 1945 రోజున చనిపోయింది. అప్పుడామె వయస్సు 73 సంవత్సరాలు. అనాచీరికి దేవుని మీద అచంచల విశ్వాసం. జీవితం.. మరణం గురించి అనాచీరికి వున్న విశ్వాసాన్ని రైస్‌ కవిత్వీకరించింది.
జీవితం, మరణం గురించి రైస్‌ రాసిన కవిత పేరు ‘ఔష్ట్రవఅ I ఎబర్‌ శ్రీవaఙవ వశీబ. ఈ కవిత చాలా మందికి నచ్చింది. ఎంతో మంది స్నేహితులు ఈ కవితని కాపీ చేసుకున్నారు. అది గ్రీటింగ్‌కార్డు మీద కూడా ప్రచురితమైంది. ఆ కార్డు కొన్ని మిలియన్ల కాపీలు ప్రింటయ్యింది. అమ్ముడు కూడా పోయింది.
ఈ కవిత గురించి మాటల్లో చెప్పలేమని, జీవితం మీద మాకు ఆశని చిగురింపచేసిందని అన్న వాళ్లూ చాలామంది వున్నారు. అట్లా తమ జీవితం చిగురించిందని ఆ ఉత్తరాలు రాసిన వాళ్లు ఎందరో. ఓ ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే ఎంతో మంది కన్నీళ్లనిఆ కవిత తుడిచింది. ఓ స్నేహితురాలిలా వాళ్ల బాధను ఓదార్చింది. కవిత్వానికి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోవడం అమెరికా ప్రజల వంతైంది.15 సంవత్సరాల కొడుకును పోగొట్టు కున్న ఓ స్త్రీ బాధను ఎవరూ నివారించలేకపొయ్యారు. రైస్‌ రాసిన ‘ఔష్ట్రవఅ I ఎబర్‌ శ్రీవaఙవ వశీబ అన్న కవితని ఆ స్త్రీకి ఆమె స్నేహితురాలు ఇచ్చింది. ఆ తరువాత ఆ స్త్రీ జీవన సరిళి మారిపో యింది. ఆమెకు బతుకుమీద ఆశ చిగురించింది. ఆ కవిత ఇలా వుంటుంది.
‘కొంత సమయం కోసం
నిన్ను వదిలినప్పుడు కూడా
బాధ పడకు
దు:ఖించకు
సంవత్సరాల తరబడి
విషాదాన్ని మోసుకు తిరగకు
ధైర్యంగా అడుగులు వేయి
విజయవంతమైన నవ్వుతో
నా కోసం
నా పేరుమీద
జీవించు
అన్ని పనులు చెయ్యి
ఒంటరివని బాధపడకు
రోజులని వృథా చెయ్యకు
ప్రతిక్షణాన్ని
ఉపయుక్తం చెయ్యి
ప్రతి పనిని ఆనందంగా
ఉల్లాసంగా చెయ్యి
అదే ఆనందం
అదే ఉల్లాసం
నీ వెంట వుంటాయి.
అంతేకానీ
ఎప్పుడూ మరణానికి భయపడకు
నీ కోసం
నీ కోసం
ఆకాశంలో ఎదురు చూస్తూ వుంటా.
కాస్సేపటికైనా నిన్ను వదిలినా నువ్వు దు:ఖించకు. కన్నీళ్లు కార్చకు. నేను నీ కోసం ఆకాశంలో ఎదురు చూస్తూ వుంటా అని చెప్పడంలో ఓ ఓదార్పు, ఓ ఆశ మనకు కన్పిస్తాయి. ప్రతి క్షణాన్ని ఉపయోగించూ అని చెప్పడంలో కర్తవ్యబోధన కన్పి స్తుంది. రైస్‌ ఓ ప్రత్యేకమైన మనిషి. అందరికన్నా ఆమె విభిన్న మైంది. ఆమె అందరికి ప్రేమని ఇచ్చింది. ప్రేమని పొందింది. ఆమె నమ్మకం భగవంతుడు. ఆమె రాసిన చాలా కవితల్లో ఓ నమ్మకం, ఓ ఆశ, ఓ అనుభూతి, ఓ అనుభవం ప్రస్ఫుటంగా కన్పిస్తాయి.
గిబ్సన్‌ గ్రీటింగ్‌కార్డుల కంపెనీలో ముప్పై సంవత్సరాలు రైస్‌ పనిచేసింది. లెక్కలేనన్ని కవితా చరణాలను రాసింది. మామూలుగా పుస్తకాలు వేస్తే అవి కొన్ని వేల సంఖ్యలో వచ్చేవి. రైస్‌ రాసిన గ్రీ టింగ్‌ కార్డుల్లోనే కాకుండా చాలా గ్రీటింగ్‌ కార్డుల్లో మంచి భావ నలు అనుభూతులు కన్పిస్తాయి.
రైస్‌ రాసిన మరో కవితని కూడా ఉదహరిస్తాను. ఆ కవిత ఇలా వుంటుంది.
‘మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవని
మనం అనుకున్నప్పుడు పాట ఆగిపోతుంది.
ఈ రోజు గడిచిపోయిన ఆరువాత
ఛాయ చీకటిలో కలిసిపోతుంది.
అప్పుడు మన కన్నీళ్లు ఆరిపోతాయి.
జీవితం చౌరస్తాలో నిలబడి
అదే జీవితానికి అంతమని భావిస్తాం.
కానీ
మనకు తెలియదు.
మన దృష్టి పరిమితమని
రోడ్డు అంతం కాలేదని
అక్కడే ఓ మలుపువుందని
మనకు తెలియదు
రోడ్డు అంతం అయినట్టు ఎలా కన్పిస్తుందో
మన జీవితమూ అంతే?
జీవితాన్ని రోడ్డుతో పోలుస్తుంది రైస్‌. రోడ్డు అంతమైనట్టు ఎలా కన్పిస్తుందో, జీవితం కూడా అంతే! రోడ్డు అంతం కాదు. జీవితమూ అంతకాదు.రైస్‌ కవిత్వం మతపరమైన నమ్మకంతో నడుస్తుంది. సంకెల్లు చందనాలు మనల్ని బానిసలని చేస్తాయి. అయితే మనకి మనమే కారాగారాలని సృష్టించుకుంటు న్నాం, భగవంతున్ని చేరుకోకుండా వుండటానికి. అందుకని భగవంతుడే మనల్ని రక్షించాలని అటుంది రైస్‌. గ్రీటింగ్‌ కార్డుల కంపెనీలు మంచి రచయితలని కవులని తమ కంపెనీలో నియమిం చుకుంటారు. ఇది ఇంగ్లిష్‌ గ్రీటింగ్‌ కార్డులని తయారు చేసే కంపెనీల స్థితి. అలాంటి పరిస్థితి తెలుగులో లేదు. కానీ తెలుగులోనూ గ్రీటింగ్‌ కార్డుల కవిత్వం వుంది. అయితే గ్రీటింగ్‌ కార్డుల కోసం కాకుండా కవులు వివిధ సందర్భాలలో రాసిన కవిత్వాలని గ్రీటింగ్‌ కార్డుల మీద ప్రచురిస్తున్నారు.హెలెన్‌ స్పైన్సర్‌ రైస్‌ కవిత్వం గ్రీటింగ్‌ కార్డుల కోసం మొదలు కాలేదు. కవిత్వం నుంచి గ్రీటింగ్‌ కార్డులకి వచ్చింది. ఆమె వృత్తి ఆమెను కొన్ని మిలియన్ల కవిత్వాలను రాయించింది.సందర్భాన్ని బట్టి కవిత్వం రాయలేం. రాయమని ఒత్తిడి చేస్తే కవిత్వం రాయలేం. కవిత్వం తన్నుకు వచ్చినప్పుడే కవిత్వం రాస్తామని మన కవులు చాలా మంది అంటూ వుంటారు. అవన్నీ అబద్ధమని నిరూపించిన కవయిత్రి రైస్‌.
కవిత్వం చెలిమెలాంటిది. నీటిని తోడుకున్న కొద్ది కొత్త నీరు వస్తుంది.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *