గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

share on facebook

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రేటర్‌ వరంగల్‌లో విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. ప్రతి గ్రామానికి అదనంగా కోటి రూపాయల నిధులను కేటాయించారని వివరించారు. గ్రేటర్‌ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్‌ నుండి 300 కోట్ల నిధులను అందిస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిధులను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అన్ని నియోజక వర్గాల కంటే వర్ధన్నపేట నియోజక వర్గాన్ని ముందుచుతామన్నని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు.

Other News

Comments are closed.