ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

share on facebook

ఇటిక్యాల(జనంసాక్షి) అగస్టు 12: మండల కేంద్రంతోపాటు ఆర్. గార్లపాడు, బి. వీరాపురం, సాసనూలు, షేక్ పల్లి, ధర్మవరం, కోదండపురం, ఎర్రవల్లి చౌరస్తా, కొండపేట, బీచ్ పల్లి, కొండేరు, జింకలపల్లి, మునగాల తదితర గ్రామాలలో శుక్రవారం ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్లకు, అక్కతముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ఈ పండుగను జరుపుకుంటారని వివిధ గ్రామాల ప్రజలు అన్నారు. అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబందానికి ప్రతీకగా రక్షా బందన్ అన్నారు. రక్షాబంధన ఉత్సవాల్లో భాగంగా మహిళలు ఆనందోత్సాహాల మధ్య రాఖీ పౌర్ణమిని జరుపుకున్నారు. అనంతరం అక్కతమ్ముళ్ల , అన్నాచెల్లెల రాఖీ వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Other News

Comments are closed.