ఘనంగా రామలింగేశ్వర జాతర

share on facebook

వికారాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల్‌ నీళ్లపల్లి ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఘనంగా జరిగింది. నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో సప్తకోణలో వెలసిన రామలింగేశ్వర స్వామి వారి దర్శం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలకు హాజరైన మంత్రి మహేందర్‌ రెడ్డి దర్శనం అనంతరం విూడియా తో మాట్లాడురు. ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తాండూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ రమేష్‌,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్‌ కుమార్‌,యంగ్‌ లీడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్‌ రెడ్డి,బషీరాబాద్‌ మండల్‌ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్‌ రెడ్డి, అజయ్‌ ప్రసాద్‌,అనంత్‌ రెడ్డి ,సుధాకర్‌ రెడ్డి స్వామివారి ని దర్శించుకున్నారు.

వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్‌ నగర్‌ జిల్లా మద్దూర్‌ మండల కేంద్రంలో వెలసిన శ్రీ విరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు…పూజారులు స్వామివారికి పాలాభిషేకం నిర్వహించి,అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు….స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు…కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి,సోదరుడు తిరుపతి రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు…..

 

Other News

Comments are closed.