చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

share on facebook

– కేసీఆర్‌, జగన్‌, మోడీ పేర్లు వింటేనే ఉలిక్కిపడుతున్నాడు
– బాబు దుష్టపాలన తొందరలోనే అంతమవుతుంది
– తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి

నల్గొండ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు ఓటమి భయంతో, కేసీఆర్‌ పై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అసహనం, ఈర్షతో చంద్రబాబు తెలంగాణపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్‌, జగన్‌ వీళ్లందరు చంద్రబాబుకు కలలో వస్తున్నారని, వాళ్ల పేరు వింటేనే ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. దుష్పచ్రారం చేయడంలో చంద్రబాబును మించిన వాళ్లు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన తొందరలోనే అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజా ధనం దోపిడి చేస్తూ కుయుక్తులకు పాల్పడుతున్నారు. మోసం, కుట్రలు చంద్రబాబుకు మారుపేరు లాంటివన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌
ఏర్పాటులో భాగంగా ఏపీ ప్రతిపక్షనేత జగన్‌ ను కలిశామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. చంద్రబాబు దుష్టపాలన తొందరలోనే అంతం అవుతుందన్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడు మాకుకూడా ఉంటే బాగుండు అని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలోని 25ఎంపీ స్థానాల్లో 21 స్థానాలు జగన్‌ గెలుస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఏపీ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. దేశంలో అత్యంత అవినీతి గల రాష్ట్రం
ఏపీనే అన్నారు. మోసాలు, అవినీతి చేయడంలో చంద్రబాబు దిట్ట అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Other News

Comments are closed.