చంద్రబాబు రాష్టాన్రికి పట్టిన శనిమండిపడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

share on facebook

విజయవాడ,డిసెంబర్‌7(ఆర్‌ఎన్‌ఎ):  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్టాన్రికి  పట్టిన శనిలా మారారని ఫైర్‌ అయ్యారు. ఏడ్చే వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమన్నారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేరని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఆయన ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా ప్రయత్నిస్తారని దుయ్యబట్టారు. అందుకే అసెంబ్లీలో శపథం చేసి మరీ వెళ్లిపోయారని చెప్పారు. సీఎంగా కాదు కదా.. ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టలేడని అంబటి రాంబాబు అన్నారు.ప్రజల్లో సానుభూతి పొందేందుకు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. గౌరవ సభలు పెడతారంటున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్‌ చంద్రబాబుకు లేదని, ఇక ఆయన అసెంబ్లీకి రానవసరం లేదన్నారు. ప్రజలు జగన్‌ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారని, అది చూసి ప్రతి నిత్యం చంద్రబాబు ఏడ్వటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నిత్యం ఏడ్చే వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవడం ఖాయమన్నారు.““““““““చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల యాత్రఘనస్వాగతం పలికిన స్థానిక నేతలుచిత్తూరు,డిసెంబర్‌7(ఆర్‌ఎన్‌ఎ):  అమరావతి రైతుల మహాపాదయాత్ర మంగళవారం చిత్తూరుకు చేరింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర 37వ రోజుకు చేరింది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజప్లలెలోకి యాత్ర ప్రవేశించగానే రైతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. టిడిపి నేతలు అమర్నాథ్‌రెడ్డి, పులవర్తి నాని, బొజ్జల సుధీర్‌ పాదయాత్రకు సంఫీుభావం తెలిపారు. పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఈ యాత్ర ప్రారంభమై సుమారు 16 కిలోవిూటర్ల మేర సాగుతూ చింతలపాలెం వరకు సాగనుంది. ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ… ఈ నెల 15, 16 తేదీల్లో వెంకటేశ్వరుడి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానంను అభ్యర్థించినట్లు తెలిపారు. దాదాపు 500 మందికి తిరుమల దర్శనం కల్పించాలని కోరామన్నారు. పాదయాత్రలో దాదాపు 200 కుటుంబాలు పాల్గొంటున్నాయని, వీరందరికీ ఒక్కసారిగా కాకున్నా విడతల వారీగా దర్శనం కల్పించాలని.. పాదయాత్ర చేసి వచ్చిన భక్తులకు వెంకటేశ్వరుడి మొక్కు చెల్లించే అవకాశం ఇవ్వాలని టిటిడిని కోరినట్లు చెప్పారు. ఈ నెల 17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస ప్రతినిధులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపామని, త్వరితగతిన అనుమతి ప్రకటిస్తే ఏర్పాటు చేసుకుంటా మన్నారు. సభకు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనుమతి తిరస్కరిస్తే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం అని ఐకాస ప్రతినిధులు పేర్కొన్నారు.

Other News

Comments are closed.