చమురు ధరలకు విదేశీ కంపెనీలే కారణం: శుక్లా

share on facebook

న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి): పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా స్పందించారు. విదేశీ కంపెనీలు ఇంధన ధరలు పెంచుతున్నాయని ఆయన తెలిపారు. క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ మంత్రి చెబుతున్నారని శుక్లా గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అంగీకరిస్తే.. ఈ అంశాన్ని మండలి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉంటాయని కేంద్ర మంత్రి శుక్లా తెలిపారు.

Other News

Comments are closed.