చరిత్ర సృష్టించే దిశగా భారత్‌

share on facebook

రాణించిన మయాంక్‌, శతక్కొట్టిన పూజారా
తొలిరోజు భారత్‌ 303/4
కాన్‌బెర్రా,జనవరి3(జ‌నంసాక్షి):ఆస్టేల్రియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్‌ పుజారా(130 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39
బ్యాటింగ్‌; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. పుజారా శతకంతో ఆకట్టుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు మయాంక్‌(77) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. పుజారా-మయాంక్‌ జోడీ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌ వుడ్‌ రెండు వికెట్లు, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.గురువారం ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్టులో భారత్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో  ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లు ప్రారంభించారు. అయితే ఆదిలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌(9) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్‌ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు మయాంక్‌. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.అనంతరం పుజారాతో కలిసి విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనులు మొదలు పెట్టాడు.ఈ క్రమంలోనే పుజారా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్‌ తర్వాత విరాట్‌ కోహ్లి(23)  ఔట్‌ కావడంతో భారత్‌ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన రహానే(18; 55 బంతుల్లో 1 ఫోర్‌) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత హనుమ విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను పుజారా చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈసెంచరీతో టెస్టుల్లో పుజారా 18సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.ఈ ఏడాదిలో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కొత్త రికార్డును పుజారా నమోదు చేశాడు.మూడో స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మన్లలో అత్యధిక సెంచరీలు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా పుజారా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు మూడో నంబరులో వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు పూర్తి చేసుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్‌లో పుజారా 200 బంతులకు పైగా ఆడటం ఇది నాలుగో సారి. దీంతో సునీల్‌ గావస్కర్‌  రికార్డును పుజారా అధిగమించాడు. 1977-78లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గావస్కర్‌ మూడు సార్లు 200 బంతులకు పైగా ఆడారు.

Other News

Comments are closed.