చలాకి చంటికి తప్పిన ప్రమాదం

share on facebook

రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న కారు

మహబూబ్‌నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జబర్దస్త్‌ ఫేం చలాకి చంటి కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ హైవేపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుకనుంచి మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో చంటికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, రెండు కార్లు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Other News

Comments are closed.