చెన్నయ్‌కు తరలిస్తుండగా భారీగా నగదు పట్టివేత

share on facebook

నెల్లూరు,జనవరి23(జ‌నంసాక్షి): నెల్లూరు జిల్లా తడలో బుధవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి చెన్నయ్‌కి కారు తరలిస్తున్న రూ.6.30 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ నగదు పట్టుబడింది. చెన్నయ్‌ లో జువెల్లరీ కొనుగోలు కోసం ఈ నగదు తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలు చూపాలని సూచించారు.

Other News

Comments are closed.