చైనా పర్యటనలో ఇమ్రాన్‌ ఖాన్‌

share on facebook

 

బీజింగ్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం చైనా చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఇమ్రాన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవడం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. ఈ నెల 5న షాంగైలో జరిగే ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌ ఎక్స్పోలో కూడా ఇమ్రాన్‌ పాల్గొననున్నట్టు సమాచారం. పాక్‌ ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, ఆర్ధిక మంత్రి అసద్‌ కుమార్‌, వాణిజ్య సలహాదారు అబ్దుల్‌ రజాక్‌ దావూద్‌, రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ తదితరులు కూడా చైనా వెళ్లినట్టు స్థానిక విూడియా వెల్లడించింది.

చైనా-పాక్‌ మధ్య ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యంత కీలకమైన పర్యటనగా చెబుతున్నారు. కోట్లాది రూపాయల సీబీఈసీ ప్రాజక్టుపై విభేధాలను పక్కనబెట్టడంతో పాటు… కఠినమైన ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీ నిబంధనల నుంచి ఊరట పొందేలా మిత్రదేశాలను ఒప్పించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే భారీ అంచనాల మధ్య ఇమ్రాన్‌ చైనా చేరుకున్నారు.

 

 

Other News

Comments are closed.