చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

share on facebook

 

నెల్లూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్‌పి కైమ్ర్‌ ఆంజనేయులు పర్యవేక్షణలో సిసిఎస్‌ డిఎస్‌పి బాల సుందర్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం చైన్‌ స్నాచింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. అన్నమయ్య సర్కిల్‌ వద్ద చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు వ్యక్తులు గతంలో నేర చరిత్ర కలిగిన వారుగా గుర్తించి వారిని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. 1.తుపాకుల కుమార్‌ బాణాల 2.చిన్న తుపాకుల సునీల్‌, 3. మేకల రాజు 4. మేకల ప్రేమ్‌ కుమార్‌ అనే నలుగురు వ్యక్తుల వద్ద నుండి 90 సవరల బంగారాన్ని, 50 వేల రూపాయల నగదును, మొబైల్‌ ఫోన్‌లు రెండు, మోటార్‌ సైకిల్‌ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు చిన్నతనం నుండి నేరాలు చేయడానికి అలవాటు పడి మహారాష్ట్ర,

కర్నాటక, తమిళనాడు, ఆంధప్రదేశ్‌ రాష్టాల్లో అనేక నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. తాము నెల్లూరు, చిత్తూరు, కర్నాటకలో పలు నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని చెప్పారు. నెల్లూరు జిల్లా జైలులో సహా పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తూ జామినిపై విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఐశ్వర్య అభినందించారు. ఈ ఆపరేషన్లో నెల్లూరు కైమ్ర్‌ బ్రాంచ్‌ సిఐ బాబీ, జాన్‌, సైదా, బాలాజీ నగర్‌ సీఐ వేణుగోపాల్‌ రెడ్డి, సి సిఎస్‌ఎస్‌ఐ లు ఎస్కె షరీఫ్‌, మురళి ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Other News

Comments are closed.