జగన్‌కు దోచుకోవడం తప్ప అభివృద్ది పట్టదు: అయ్యన్న

share on facebook

విశాఖపట్టణం,జనవరి7(జ‌నంసాక్షి): జగన్‌కి తండ్రి వైఎస్‌ రాష్టాన్న్రి దోచుకోవడం మాత్రమే నేర్పారని, నాయ్యకత్వ లక్షణాలు బోధించలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్టాన్న్రి లూటీ చేసి దోచుకున్నారని అందుకే 14 నెలలు జగన్‌ని జైల్లో పెట్టారన్నారు. అవినీతిపరులే నేడు నీతులు బోధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి రంగంతో సహా అనేక రంగాల్లో అభిశృద్ది శరవేగంగా సాగుతోందన్నారు. హేతుబద్దత లేకుండా రాస్ట్రాన్ని విభజించిన తరవాత చంద్రబాబు అ¬రాత్రులు కష్టపడుతూ ఎపిని ముందుకు తీసుకుని పోతున్నారని అన్నారు. ఇవన్నీమమరచి అవినీతి నేత చంద్రబాబుపై పుస్తకాన్‌ఇన విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్టాన్న్రి అభివృద్ధి పరుస్తున్న దశలో జగన్‌కి ఏమైనా అభిమానం ఉంటే తగిన సూచనలు చేయాలని అన్నారు. పలుగ్రామాల్లో జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో రూ. 150 కోట్లతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ఏడాది అయిదు లక్షల ఇళ్లు కడతామని, ప్రతి ఏటా ఇలాగే మంజూరు చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర ఏళ్లలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మిస్తామన్నారు. అలాగే 2,500 నూతన పంచాయతీ భవనాలు, అయిదు వేల కిలోవిూటర్ల మేర గ్రామాల్లో సిమెంటు రహదారులు నిర్మాణా నికి నిర్ణయించినట్లు, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం అనుమతులు ఇచ్చారని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. 24 వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తే 60 నుంచి 70 శాతం వరకు కాంగ్రెస్‌, వైకాపా వాళ్లే లబ్ధి పొందారన్నారు. ఎందుకంటే గత పదేళ్లలో సామాన్యులకు రుణాలివ్వకుండా వారే తీసుకున్నారన్నారు. గత పదేళ్లలో చెరువులు ఆక్రమించుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గుర్తు చేశారు.

Other News

Comments are closed.